సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటానికి మత రంగు పులిమి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయొద్దని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో సెప్టెంబర్ 17పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇది భూస్వామ్య వ్యవస్థకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక ప్రజా పోరాటమే తప్ప, హిందూ-ముస్లింల ఘర్షణ కాదని స్పష్టం చేశారు. 1947 సెప్టెంబర్ 11న కమ్యూనిస్ట్ యోధులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, 4,500 మంది ప్రాణాలర్పించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని గుర్తుచేశారు. పేరేదైనా సరే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని, పాఠ్యాంశాల్లో సాయుధ పోరాట చరిత్రను చేర్చాలని డిమాండ్ చేశారు.